ఈసారి పాన్ ఇండియా లెవెల్లో “పొలిమేర 3” ప్రయోగం..

ఈసారి పాన్ ఇండియా లెవెల్లో “పొలిమేర 3” ప్రయోగం..

Published on Jul 10, 2024 10:50 AM IST

మన టాలీవుడ్ నుంచి వచ్చిన పలు క్రేజీ థ్రిల్లర్స్ లో ఆడియెన్స్ మైండ్ బ్లాక్ చేసిన చిత్రం “మా ఊరి పొలిమేర” సినిమా కూడా ఒకటి. టాలెంటెడ్ నటుడు సత్యం రాజేష్ హీరోగా దర్శకుడు అనీల్ విశ్వనాధ్ తెరకెక్కించిన ఆ చిత్రం ఓటిటిలో సెన్సేషనల్ హిట్ కాగా దీనికి రెండో సినిమా పొలిమేర 2 ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తే భారీ హిట్ అయ్యింది.

ఇక ఈ ఫ్రాంచైజ్ ని కొనసాగిస్తూ స్కేల్ ని కూడా మేకర్స్ పెంచుతూ వెళ్తుండగా ఇప్పుడు ఈ అవైటెడ్ సీక్వెల్ “పొలిమేర 3” ని పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి నిర్మాతగా మారి మొదటి సినిమాగా టేకప్ చేస్తుండగా ఫస్ట్ పార్ట్ ని నిర్మాణం వహించిన భోగేంద్ర గుప్త సహా నిర్మాతగా పార్ట్ 3 కి వ్యవహరించనున్నారు.

ఇక ఈ చిత్రం స్క్రిప్ట్ పనులు ఆల్రెడీ పూర్తి కాగా ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారట. అతి త్వరలోనే సినిమా స్టార్ట్ అయ్యి పాన్ ఇండియా రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా ఇప్పుడు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ సినిమాలో సత్యం రాజేష్ సహా గెటప్ శ్రీను, పృథ్వీ, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్యలు ప్రధాన తారాగణంగా కనిపించనున్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు