ఈసారి కూడా సమంతానా లేక నాగార్జునా.?

Published on Oct 29, 2020 8:00 am IST

అక్కినేని కోడలుగా తెలుగు ఇండస్ట్రీలో ఇపుడు సమంతా అత్యద్భుతంగా రాణిస్తుంది. ఒకపక్క సినిమాలు చేస్తూనే డిజిటల్ వరల్డ్ లోకి అడుగు పెట్టిన ఈ స్టార్ట్ హీరోయిన్ ఇటీవలే స్మాల్ స్క్రీన్ పైకి కూడా అడుగు పెట్టడం మనం చూసాము. మన తెలుగు బిగ్గెస్ట్ గ్రాండ్ రియాలిటీ షూ అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 4 కు గత వారిపై హోస్ట్ గా సమంత కనిపించి హౌస్ మేట్స్ ను ఆశ్చర్యపరిచింది.

అయితే అంతకు ముందు అత్యద్భుతంగా హోస్ట్ చేసిన సమంతా మామయ్య కింగ్ నాగార్జున తన సినిమా షూట్ లో బిజీగా ఉండడం కారణంగా ఈసారి ఆమె టేకప్ చేసింది. అయితే సమంతా హోస్టింగ్ కు ఒక్క బిగ్ బాస్ హౌస్ మేట్స్ నుంచి మాత్రమే కాకుండా షో వీక్షకుల నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

దీనితో ఈ వచ్చే వారాంతం కూడా సమంతా చేస్తుందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ లేటెస్ట్ టాక్ ప్రకారం ఈసారి మళ్ళీ నాగార్జునే యథావిధిగా హోస్టింగ్ చేయనున్నట్టుగా సమాచారం. సో ఇక నుంచి సమంతా హోస్టింగ్ మళ్ళీ లేనట్టే అని చెప్పాలి. మరి ఈ వారాంతం ఏం జరగనుందో వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :

More