సోనూసూద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో మరో మహత్తర సాయం.!

Published on May 31, 2021 10:06 am IST

ఇప్పుడు ఒక్క సినీ అభిమానులే కాకుండా మొత్తం భారతదేశం అంతటికీ కూడా సోనూసూద్ పేరు అంటే ఏంటో తెలుసు. గత ఏడాది విసిరిన కరోనా పంజా నుంచి ఇండియన్ రియల్ సూపర్ హీరోగా నిలిచాడు. అక్కడ ఇక్కడ అని లేకుండా దేశ వ్యాప్తంగా నలుమూలలా తన సాయాన్ని అందించాడు. అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సోనూసూద్ చాలానే సాయం అందించారు.

మరి ఇప్పుడు సోనూసూద్ మరో మహత్తర కార్యానికి పూనుకున్నారు. ఇది వరకే ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేసిన సోనూసూద్ ఇపుడు ఏపీ మరియు తెలంగాణా పల్లెల్లో కోవిడ్ వలన చనిపోయిన మృతదేహాల సంరక్షణ నిమిత్తం డెడ్ బాడీ ఫ్రీజర్స్ పంపిణీ చెయ్యడం స్టార్ట్ చేసారు.

ఇప్పటికే సంకిరెడ్డి పల్లి, ఆశాపూర్, మద్దికెర తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసి త్వరలోనే ప్రతీ గ్రామంలో ఏర్పాటు చేస్తానని సోనూ సూద్ హామీ ఇచ్చారు. చాలా గ్రామాల్లో ఈ ఇబ్బందులు ఉన్నాయని తన దృష్టికి వచ్చింది అని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. నిరంతర శ్రామికుడిగా కష్టపడుతున్న సోనూసూద్ ఓ పక్క సాయంతో పాటుగా పలు చిత్రాల్లో కూడా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :