ఆర్మీ కోసం నా పేరు సూర్యస్పెషల్ షో!

ఆర్మీ కోసం నా పేరు సూర్యస్పెషల్ షో!

Published on May 6, 2018 2:55 PM IST


అల్లు అర్జున్ కెరీర్ లోనే ఎంతో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన నా పేరు సూర్య విడుదల రోజు నుంచి డీసెంట్ టాక్ ను తెచ్చుకుంటోంది. అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ అందుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కూడా పెంచుతోంది. సినిమాలో అల్లు అర్జున్ ఒక సైనికుడి కనిపించిన తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. తన నటనతో సినిమాకు ప్రాణం పోశాడు అనేలా బన్నీ సినీ ప్రముఖుల నుంచి మంచి టాక్ తెచ్చుకుంటున్నాడు.

ఇకపోతే హైదరాబాద్ కు చెందిన కొంత మంది ఆర్మీ అధికారులకు సినిమా స్పెషల్ షో వేయాలని నా పేరు సూర్య చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యింది. సినిమాలో ఆర్మీ సైనికుడి పాత్ర అందరికి కనెక్ట్ అవ్వడంతో సైనికులకు కూడా స్పెషల్ షో వేయాలని ఈ రోజు నిర్ణయించారు. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను లగడపాటి శ్రీధర్ – నాగబాబు సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు