ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ వచ్చేది అప్పుడే..?

Published on May 21, 2020 7:27 am IST

ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా నిన్న ప్రశాంత్ నీల్ విశెష్ చెవుతూ మూవీ కూడా కన్ఫర్మ్ చేశారు. ఆయన పరోక్షంగా ఎన్టీఆర్ తో మూవీ ఉంటుందని స్పష్టం చేశారు. దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న కాంబినేషన్ సాకారం అయ్యింది. ఐతే ఈ మూవీ థియేటర్స్ లో దిగేది మూడేళ్ళ తర్వాతనే అని టాక్ వినిపిస్తుంది. వచ్చే ఏడాది ఎన్టీఆర్ నుండి రెండు చిత్రాల విడుదల ఉంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ తో పాటు, త్రివిక్రమ్ మూవీ విడుదల అయ్యేది వచ్చే ఏడాదే.

ఇక ప్రశాంత్ నీల్ మూవీ 2021 చివర్లో లేదా 2022 ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. కాంబినేషన్ రీత్యా మరియు భారీ పాన్ ఇండియా చిత్రం కావడంతో ఏడాదికి పైనే షూటింగ్ జరుపుకోవడం ఖాయం. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ 31వ చిత్రం థియేటర్స్ లోకి వచ్చేది 2023 తర్వాతనే. ఇక 2022లో మరలా ఎన్టీఆర్ నుండి ఎటువంటి చిత్రం ఉండకపోవచ్చు. ఇప్పటికే ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ కారణంగా రెండేళ్లు మిస్ కాగా, మరో ఏడాది ప్రశాంత్ నీల్ మూవీ వలన కోల్పోయే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :

X
More