ఎన్టీఆర్ 97వ జయంతి నేడు !

Published on May 28, 2019 2:00 am IST

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ 97వ జయంతి రేపు. ఈ నేపథ్యంలో ఆయన జయంతి వేడుకలను ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. అయితే దర్శకుడు వై.వి.ఎస్‌. చౌదరికి ఎన్టీఆర్ అంటే ఎంతటి అభిమానమో ప్రతి తెలుగువాడికి తెలుసు. ఎన్టీఆర్ జయంతికి వర్ధంతికి ఆయన తన మనసులోని అభిమానాన్ని భావాలను అక్షరరూపంలో తీసుకొచ్చి ఎన్టీఆర్ ను ప్రజలు సాక్షిగా తలచుకుంటారు. కాగా ఎన్టీఆర్ 97వ జయంతికి కూడా వై.వి.ఎస్‌. చౌదరి ఎన్టీఆర్ ని ఉద్దేశించి ఈ విధంగా రాసుకొచ్చారు.

తెలుగుజాతి వాడిని, వేడిని, పౌరుషాన్ని, తెగువని ప్రపంచపు నలుమూలలా చాటిచెప్పి..కులం, మతం, ప్రాంతం మరియూ రాజకీయ పార్టీలకు అతీతంగా అభిమానుల్ని సంపాదించుకున్న..‘అన్న’ ‘ఎన్‌. టి. ఆర్‌.’ ‘శత జయంతి’ ఉత్సవాలను ఘనంగా జరిపే ప్రణాళికలను ఇప్పటి నుంచే రూపొందించాలనీ..ఆయన జ్ఞాపకార్ధం, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏవైనా రెండు జిల్లాలకి ‘ఎన్‌. టి. ఆర్‌. జిల్లా’ పేరుతో నామకరణం జరపాలనీ..ఆయన్ని ‘భారతరత్న’ బిరుదాంకితుడిగా చూడాలన్న తెలుగువాళ్ళ చిరకాల స్వప్నం సాకారం చేయాలనీ..ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న అసంఖ్యాక తెలుగు వారందరి తరపున.. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, భారతదేశ ప్రభుత్వాలను వినమ్రంగా కోరుతూ.. ఆయన వీరాభిమాని….‘బొమ్మరిల్లు వారి’ సంస్థ అధినేత వై. వి. ఎస్‌. చౌదరి.

సంబంధిత సమాచారం :

More