తారక్ అన్నయ్య అద్భుతంగా నటించారు – నారా బ్రాహ్మణి

తారక్ అన్నయ్య అద్భుతంగా నటించారు – నారా బ్రాహ్మణి

Published on Oct 21, 2018 10:41 PM IST

త్రివిక్రమ్ దర్శకత్వంలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం ప్రస్తుతం బాక్సాఫిస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. సినిమా పై మంచి టాక్ రావడం, దానికితోడు ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉండటంతో.. సినిమా పై ప్రేక్షకుల్లో సహజంగానే ఆసక్తి పెరిగింది. పైగా దసరా సెలవులు కూడా రావడంతో.. ఈ చిత్రం రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ను రాబడుతుంది. కాగా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు అర‌వింద స‌మేత‌ పై, తారక్ నటన పై ప్ర‌శంస‌లు కురింపించిన విషయం తెలిసిందే.

తాజాగా ఆంధ్రప్రదేశ్ పంచాయత్ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రి నారా లోకేష్ సతీమణి, బాలక్రిష్ణ పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి ఈ చిత్రాన్ని చూసి.. సినిమా చాలా బాగుందని, తన అన్నయ్య తారక్ అద్భుతంగా నటించారని ప్రశంసలు కురిపించారు. అలాగే నందమూరి హరిక్రిష్ణగారి అరుదైన ఫోటోలను సేకరించి బ్రాహ్మణి తన అన్నయ్య తారక్ కు గిఫ్ట్ గా ఇచ్చారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు