అక్టోబర్‌ నుంచి రాజమౌళితో ఎన్టీఆర్, చరణ్ !

Published on Jul 15, 2018 11:47 am IST

దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రం ప్రారంభయ్యే ముహూర్తం ఖరారైంది. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్‌ నెలలో మొదలు కానుంది. డీవీవీ దానయ్య, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఆర్ఆర్ఆర్‌’ అనేది వర్కింగ్‌ టైటిల్‌ గా ఉంది.

తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ చిత్ర కథ పూర్తి అయి, అద్భుతంగా వచ్చిందని, ఇద్దరి హీరోలకు కూడా వినిపించారని తెలుస్తోంది. కాగా మొదటగా ఎన్టీఆర్ పార్ట్, తర్వాత రామ్ చరణ్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఆ తరువాత ఇద్దరి కాంబినేషన్ లో ఉన్న సన్నివేశాలను తెరకెక్కిస్తారట. ఐతే ఈ చిత్రం పూర్తి కావడానికి రెండు సంవత్సరాలు పడుతుందని, 2020లో విడుదల కానున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూర్చగా, కెమెరా బాధ్యతలు సెంథిల్‌ కుమార్‌ చేపట్టనున్నారు.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ చిత్ర షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తుండగా, రామ్ చరణ్, దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :