‘దానవీర శూరకర్ణ’ ఆడియోకి నందమూరి అతిధులు వీళ్ళే.!

‘దానవీర శూరకర్ణ’ ఆడియోకి నందమూరి అతిధులు వీళ్ళే.!

Published on May 4, 2015 6:33 PM IST

ntr-kalyan-ram
స్వర్గీయ నందమూరి తారక రామారావు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సినిమాలు, మాత్రం ఎప్పుడూ మనతోనే ఉన్నాయి. ఆయన కెరీర్లో టాప్ ప్లేస్ లో ఉండే సినిమా ‘దాన వీర శూర కర్ణ’. ఇలాంటి సినిమా ఇప్పుడు చేయడం అసాధ్యమే.. కానీ ఆయన వారసుడు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేడు. స్వర్గీయ నందమూరి జానకిరామ్‌ తనయుడు మాస్టర్‌ ఎన్టీఆర్‌ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం ‘దానవీర శూరకర్ణ’. జె.వి.ఆర్‌ దర్శకుడు. శ్రీసాయి జగపతి పిక్చర్స్‌, సంతోష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె.బాలరాజు, చలసాని వెంకటేశ్వరరావు నిర్మాతలు.

షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియోని ఈ నెల 6న రిలీజ్ చేయనున్నారు అని ఇది వరకే తెలియజేశాం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియోకి నందమూరి హీరోలు అయిన ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రామ్ మరియు హరికృష్ణ ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు. ‘బాల రామాయణం’ తర్వాత అంతా బాలనటీనటులతో వస్తున్నా చిత్ర ఇదే కావడం విశేషం. మే 28న మహానటుడు నందమూరి తారకరామారావుగారి జయంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

తాజా వార్తలు