యూకేలో ఘనంగా ఎన్టీఆర్-సుకుమార్‌ల మూవీ లాంచ్?

యూకేలో ఘనంగా ఎన్టీఆర్-సుకుమార్‌ల మూవీ లాంచ్?

Published on Mar 11, 2015 12:35 PM IST

NTR-Sukumar11
‘టెంపర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, తన తరువాతి చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. సరికొత్త కథాంశాలు, మ్యాజిక్ స్క్రీన్‌ప్లేతో తెలుగులో టాప్ డైరెక్టర్‌లో ఒకరుగా పేరు తెచ్చుకున్న సుకుమార్, ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. 1 నేనొక్కడినే తర్వాత సుకుమార్ స్థాయి మరింత పెరిగింది. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడకపోయినా, సుకుమార్ అనితరసాధ్య ప్రతిభను మాత్రం చాటిచెప్పింది. ‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాని అందించిన బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈసినిమాను నిర్మిస్తున్నారు.

తాజా సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ అధిక భాగం యూకేలోనే జరుగుతుందనీ, ఒకే షెడ్యూల్‌లో యూకే సన్నివేశాలన్నీ పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా సినిమా అధికారిక ప్రారంభోత్సవాన్ని కూడా అక్కడే ఘనంగా జరిపే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. సుకుమార్ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ బలంగా ఉన్నందున ఈ కార్యక్రమాన్ని అక్కడే లాంచ్ చేయడం కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. నిజానికి ఈ సినిమా పూజా కార్యక్రమం డిసెంబర్ నెల్లోనే జరగగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే నిమగ్నమయ్యారు సుకుమార్. ఇక అఫీషియల్ లాంచ్ ఎప్పుడన్నదే ప్రశ్న. ఫిల్మ్ వర్గాల సమాచారం మేరకు స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం ఏప్రిల్ తర్వాత రెగ్యులర్ షూటింగ్‌కెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్‌ నటించనున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు