ప్రభాస్, మహేష్ వలె ఎన్టీఆర్ కూడా..?

Published on Mar 20, 2020 7:24 am IST

ఇండస్ట్రీలో స్టార్ హీరోలు తమ పంథా మార్చారు. వారు నటించే ప్రతి సినిమాలో వారు కూడా నిర్మాణ భాగస్వాములు కావాలని అనుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉండే నేపథ్యంలో టాక్ తో సంబంధం లేకుండా మినిమమ్ వసూళ్లు వస్తాయి. అలాగే పెట్టుబడికి లాభం కలుపుకొని సినిమా నిర్మాతలు అమ్మేసుకుంటారు. ఇక డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ ఉండనే ఉన్నాయి. స్టార్ హీరోతో సినిమా అంటే లాభాలు గ్యారంటీ అనే పరిస్థితి నెలకొని ఉంది. ఈ అడ్వాంటేజ్ ని స్టార్ హీరోలు సైతం క్యాష్ చేసుకుంటున్నారు. వారు కూడా సినిమా నిర్మాణంలో భాగస్వాములుగా ఉంటున్నారు.

మహేష్, ప్రభాస్ వంటి హీరోలు ఇప్పటికే ఈ పద్ధతి ఫాలో అవుతుండగా, తాజాగా ఈ లిస్ట్ లో ఎన్టీఆర్ చేరారు. త్రివిక్రమ్ తో ఆయన చేస్తున్న చిత్రం నుండి ఈ పద్ధతి మొదలుపెట్టనున్నాడు. ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ కళ్యాణ్ రామ్ ది అయినప్పటికీ ఎన్టీఆర్ కూడా ఈసారి వాటా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక భవిష్యత్తులో ఓ నిర్మాణ సంస్థను స్థాపించే ఆలోచనలో ఉన్న ఆయన ఇకపై తాను నటించే ప్రతి సినిమా నిర్మాణ భాగస్వామిగా ఉండాలని నిర్ణయించుకున్నారట.

సంబంధిత సమాచారం :

More