ఎన్టీఆర్ సినిమాలో అనుష్క !

ఎన్టీఆర్ సినిమాలో అనుష్క !

Published on Nov 6, 2018 5:50 PM IST

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రగా తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఆ రోజుల్లో ఎన్టీఆర్ సరసన పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఓ మాజీ ప్రముఖ హీరోయిన్ పాత్రలో.. అనుష్క శెట్టి నటించబోతుంది. వివరాల్లోకి వెళ్తే.. బి. సరోజా దేవి పాత్రలో అనుష్క నటిస్తోంది.

అప్పట్లోఎన్టీఆర్ పక్కన బి.సరోజా దేవి చాలా చిత్రాల్లో కలిసి నటించారు. అందులో చాలా చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ చిత్రాలకు సంబంధించిన షూటింగ్ సంఘటనలను ఈ బయోపిక్ లో చూపించనున్నారు. త్వరలో జరగబోయే షెడ్యూల్ లోనే అనుష్క శెట్టి పై చిత్రబృందం ఆ సన్నివేశాల తాలూకు సీన్స్ ను చిత్రీకరించనున్నారు.

కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. కాగా జనవరి 9న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు