క్రిష్ దర్శకత్వంలో బాలయ్య నిర్మాణంలో మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఆయన బయోపిక్ పార్ట్స్ శరవేగంగా తెరకెక్కుతున్నాయి. కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం దర్శకుడు క్రిష్ ఈ చిత్రంలో లెంజెండరీ దర్శకుడు కేవీ రెడ్డి పాత్రలో కనిపించనున్నారు. ఈ సన్నివేశాల్లో కొన్నిటిని ఇప్పటికే షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఐతే క్రిష్ ‘మహానటి’ చిత్రంలో కేవీ రెడ్డి పాత్రలో నటించి మెప్పించారు. మరి ఈ చిత్రంలో ఎలా నటించారో చూడాలి.
ఇక ఎన్టీఆర్ బయోపిక్ లో కేవీ రెడ్డిగారి చివరి రోజుల్లో ఎదుర్కొన్న ఆర్ధిక ఇబ్బందులను, అప్పటి పరిస్థితులను చూపించనున్నారు. ఎన్టీఆర్ గారు కేవీ రెడ్డిగారికి చేసిన సాయాన్ని కూడా ఈ చిత్రంలో ప్రస్తావించనున్నారు.
కాగా కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను జనవరి 9న విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు. బుర్రా సాయిమాధవ్ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.


