తండ్రిని గుర్తుకు తెస్తున్న నందమూరి హీరో !

తండ్రిని గుర్తుకు తెస్తున్న నందమూరి హీరో !

Published on Oct 18, 2018 7:40 PM IST

నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా క్రిష్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. భారీ తారాగణం నటిస్తోన్న ఈ చిత్రంలో ‘నందమూరి కళ్యాణ్ రామ్’ తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా దసరా పండగ సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ నుండి సాయంత్రం 4:12 గంటలకు దివంగత హరికృష్ణ గెటప్ లో ఉన్న కళ్యాణ్ రామ్ పిక్ ని విడుదల చేసింది చిత్రబృందం.

కాగా, పిక్ చూస్తుంటే హరికృష్ణగారు ఎన్టీఆర్ తో.. ‘విజయం మీది.. విజయరథ సారధ్యం నాది.. నీడలా వెన్నంటి వుంటా నాన్నగారూ… అన్నట్లు అనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక కళ్యాణ్ రామ్ తన తండ్రి గెటప్ లో అచ్చం హరికృష్ణగారిలానే కనిపిస్తున్నారు. హరికృష్ణగారు తన సినీ కెరీర్ ను త్యాగం చేసి మరీ అనుక్షణం ఎన్టీఆర్ గారిని కనిపెట్టుకొని ఉన్నారు. అందుకే బయోపిక్ లో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు