బాలయ్యతో స్టెప్స్ వేయబోతున్న మరో స్టార్ హీరోయిన్ !

బాలయ్యతో స్టెప్స్ వేయబోతున్న మరో స్టార్ హీరోయిన్ !

Published on Oct 20, 2018 10:03 AM IST


నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో.. ఆయన తండ్రి ‘నందమూరి తారకరామారావు’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ పార్ట్స్, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కిస్తున్నారు. చరిత్ర కలిగిన గొప్ప గొప్ప పాత్రలు ఉన్న ఈ చిత్రంలో.. ఆ పాత్రల స్థాయికి తగట్లుగానే ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోంది. తాజాగా అలనాటి అందాల హీరోయిన్ జయప్రద పాత్రలో.. నేటి ప్రముఖ హీరోయిన్ తమన్నా నటిస్తోంది.

ప్రస్తుతం హీరోయిన్ తమన్నా కూడా బయోపిక్ షూటింగ్ లో పాల్గొంది. అయితే ఓ సాంగ్ కి సంబంధించి కొన్ని షాట్స్ ను, అలాగే అప్పటి సినిమా షూటింగ్ కి సంబంధించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ట్యూన్స్ కూడా అద్భుతంగా వచ్చాయట. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు