ఎన్టీఆర్ హౌస్ లో ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ !

Published on Aug 14, 2018 9:57 am IST

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ‘ఎన్టీఆర్ బయోపిక్’ చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం, మొదటి షెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. తాజాగా నిన్నటి నుండి ఈ చిత్రం సెకెండ్ షెడ్యూల్ ను చిత్రబృందం తెరకెక్కిస్తున్నారు.

కాగా, సీనియర్ ఎన్టీఆర్ గారు మద్రాస్ నుండి హైదరాబాద్ వచ్చాక హబిడ్స్ ప్రాంతంలో ఓ ఇల్లును కొనుక్కొని దానిలోనే చాలా సంవత్సరాలు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇంటిలోనే రెండో షెడ్యూల్ లోని ఎన్టీఆర్ గారు బసవతారకమ్మగారి మధ్య అనుబంధాన్ని తెలియచెప్పే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఐతే బసవతారకమ్మగారి పాత్రను పోషిస్తున్న విద్యాబాలన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోని మరి ఆమె పాత్రలో నటిస్తున్నారట. విద్యాబాలన్ నటన పట్ల చిత్రబృందం సంతృప్తికరంగా ఉందని తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More