‘ఎన్టీఆర్ బయోపిక్’ ఆ రోజున మొదలవుతుంది !

‘ఎన్టీఆర్ బయోపిక్’ ఆ రోజున మొదలవుతుంది !

Published on Jun 16, 2018 2:18 PM IST

ntr56

నందమూరి బాలకృష్ణ, క్రిష్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయింది. మరి చిత్ర షూట్ ఎప్పుడు మొదలు పెడతారా అని ఎన్టీఆర్ అభిమానులు వేయి కళ్ళతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులు త్వరలో ఫలించనున్నాయి.

తాజా సమాచారం ప్రకారం జూలై 5న ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ మొదలవుతుంది. దర్శకుడు క్రిష్ బయోపిక్ లోని ముఖ్యమైన పాత్రల కోసం నటులను అన్వేషించే పనిలో ఉన్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ లో నటించే నటీనటులను ఆయన ఎంపిక చేశారట. ముఖ్యంగా ఎన్టీఆర్ గారి సతీమణి బసవతారకంగారి పాత్రలో విద్యాబాలన్, ఏపీ సీఎం చంద్రబాబు పాత్రలో రానా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ మొదటి షెడ్యూల్ లోని చాలా భాగం రామోజీ ఫిల్మ్ సిటీ లోను, రామకృష్ణ స్టూడియోలోను జరగనుంది. మూడు నెలలోకల్లా ఈ చిత్రాన్ని దాదాపు పూర్తి చెయ్యాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. మరి ఆ ‘విశ్వవిఖ్యాత నటసార్వభౌమ’ని జీవితాన్ని తెరమీద చూడాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే.

తాజా వార్తలు