‘డ్రాగన్’ ఊచకోత.. ఇండియా లోనే బిగ్గెస్ట్ రికార్డుతో మొదలు!

‘డ్రాగన్’ ఊచకోత.. ఇండియా లోనే బిగ్గెస్ట్ రికార్డుతో మొదలు!

Published on May 21, 2026 7:02 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా రుక్మిని వసంత్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం డ్రాగన్. నెక్స్ట్ లెవెల్ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి మేకర్స్ అవైటెడ్ గ్లింప్స్ ని తారక్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు. అయితే ఈ గ్లింప్స్ లో ఊహించని విజువల్స్ కి ఫ్యాన్స్ మైండ్ పోయింది. దీనితో ఈ గ్లింప్స్ ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ రికార్డు సెట్ చేసింది.

24 గంటల్లో భారీ మొత్తంలో 64 మిలియన్ కి పైగా వ్యూస్ ని రాబట్టి ఆల్ టైం రికార్డు సెట్ చేసినట్టు టీం వెల్లడి చేశారు. దీనితో డ్రాగన్ ఊచకోత మొదలైంది అని చెప్పాల్సిందే. ఇది కేవలం ఆరంభం మాత్రమే కాగా రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని వండర్స్ సెట్ చేయడం ఖాయం అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు