ఆ నటుడు పై మండిపడుతున్న ఎన్టీఆర్ అభిమానులు !

Published on Aug 7, 2018 6:27 pm IST

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ చిత్రం శరవేగంగా తెరకెక్కుతుంది. కాగా ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొన్న బిగ్‌బాస్ వన్ కంటెస్టెంట్ ఆదర్శ్ బాలకృష్ణ, త్రివిక్రమ్ – ఎన్టీఆర్‌తో కలిసి ఫొటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పోస్టే ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.

వివరాల్లోకి వెళ్తే.. పోస్ట్ లో దర్శకుడు త్రివిక్రమ్‌ ను సర్ అని పిలిచిన ఆదర్శ్.. తమ అభిమాన హీరోకు మాత్త్రం ఆ గౌరవం ఇవ్వలేదని ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. ఎన్టీఆర్‌ మాకు దేవుడు.. క్లోజ్ గా ఉంటున్నాడు కదా అని ఎలా పడితే అలా పిలిస్తే… జాగ్రత్త అని రాయలేని విధంగా వార్నింగ్ ఇస్తూ ఎన్టీఆర్ ను ఇక నుంచి ‘సర్ లేదా ఆన్న’ అని పిలువు అంటూ ఆదర్శ్ కు అభిమానులు ట్విట్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More