ఎన్టీఆర్ నుండి రెండు కీలక అప్డేట్స్?

ఎన్టీఆర్ నుండి రెండు కీలక అప్డేట్స్?

Published on May 19, 2020 7:15 PM IST

NTR 2

ఎన్టీఆర్ ఫ్యాన్స్ గత రెండు నెలలుగా ఎదురు చూస్తున్న ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ లుక్ వీడియో విడుదల లేదన్న న్యూస్ వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది. దానికి సాంకేతిక నిపుణులు అందుబాటులో లేకపోవడం, ఫస్ట్ లుక్ వీడియోకి సరిపడా షూటింగ్ జరగలేదు అనేవి కారణాలుగా ఉన్నాయి. ఐతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం మరో రెండు ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ తన 30వ చిత్రం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా రాగా, లాక్ డౌన్ అనంతరం సెట్స్ పైకి వెళ్లనుంది.

ఐతే ఈ మూవీ టైటిల్ పోస్టర్ విడుదల ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో త్రివిక్రమ్ మూవీ టైటిల్ పోస్టర్ ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా రావచ్చన్న నమ్మకం ఉంది. అయినను పోయిరావలె హస్థినకు అనే ఓ టైటిల్ ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఇక త్రివిక్రమ్ తరువాత ఎన్టీఆర్ కెజిఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మూవీ చేయడం దాదాపు ఖాయమే అన్న ప్రచారం జోరుగా సాగుతుంది. కాబట్టి ఈ చిత్ర నిర్మాతలుగా ఉన్న మైత్రి మూవీ మేకర్స్ ఏమైనా స్పష్టత ఇవ్వవచ్చు. దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ రెండు అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు