వైరల్ అవుతోన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీడియో !

Published on May 16, 2021 11:12 pm IST

ఎన్టీఆర్‌ పుట్టిన రోజుకు మరో నాలుగు రోజులే సమయం ఉంది. అయితే, ఈ నెల 10న కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచనలు పాటిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ అభిమానులు తారక్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. ‘మా నందమూరి తారకరామారావు గారు కోవిడ్ నుంచి తొందరగా కోలుకోవాలని ఈ రోజు తిరుపతిలో దేవాలయానికి, మసీదుకు, చర్చికి వెళ్లి మత ప్రార్థనలు చెయ్యడం జరిగింది’ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూజ జరిపించిన ఆ విజువల్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తారక్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు. తన తరువాత సినిమాల లిస్ట్ తో పాటు అవకాశం వస్తే హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తా అని క్లారిటీ ఇచ్చాడు. ఇక తారక్ ప్రెజెంట్ చేస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా పూర్తయిన వెంటనే కొరటాల శివ సినిమాని పట్టాలెక్కించనున్నారు. అలాగే ఆ తరువాత ప్రశాంత్‌ నీల్‌ తో ఒక సినిమా, ఆ తరువాత త్రివిక్రమ్‌ నూ మరో సినిమా చేయనున్నాడు.

సంబంధిత సమాచారం :