సక్సెస్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న ఎన్టీఆర్ !


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘జైలు లవ కుశ’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తారక్ త్రిపాత్రాభినయంలో నటిస్తునం చిత్రం కావడంతో అభిమానవుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. ఇకపోతే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న రిలీజ్ చేయాలని తారక్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన నటించిన ‘జనతా గ్యారేజ్’ కూడా గతేడాది సెప్టెంబర్ 1 నాడే రిలీజై భారీ విజయాన్ని అందుకుంది.

అందుకే ఆ సెంటిమెంట్ ప్రకారమే ‘జై లవ కుశ’ ను కూడా అదే రోజు రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అయితే ఈ విషయంపై తారక్ క్యాంపు నుండి అధికారిక సమాచారం వెలువడే వరకు ఎలాంటి కన్ఫర్మేషన్ కు రావడానికి లేదు. ఇకపోతే ప్రస్తుతం హైదరాబాద్ శివారాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం నిర్మాత కళ్యాణ్ రామ్ పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తున్నారు. ఇందులో తారక్ సరసన రాశి ఖన్నా, నివేత థామస్, నందిత రాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా కన్నడ హీరో దునియా విజయ్ విలన్ పాత్ర చేస్తున్నారని అంటున్నారు కానీ కన్ఫర్మేషన్ అయితే ఇంకా లేదు.