యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’. టైటిల్ ని బట్టి ఇందులో తండ్రి కొడుకుల సెంటిమెంట్ ఎక్కువ ఉంటుందని అనుకుంటారు. అందరూ అనుకున్నట్టు సెంటిమెంట్ తో పాటు పర్ఫెక్ట్ కమర్షియల్ అంశాలు కూడా ఉన్న సినిమాగా డైరెక్టర్ సుకుమార్ దీన్ని తీర్చిదిద్దాడు. సుకుమార్ ఎన్.టి.ఆర్ ని మునుపెన్నడూ చూపించని లుక్ లో చూపడం కోసం తన లుక్ మొత్తాన్ని మార్చేశాడు. ఇటీవలే రిలీజ్ అయిన ఎన్.టి.ఆర్ లుక్ మరియు టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
దీపావళి కానుకగా రిలీజ్ అయిన మరో పోస్టర్ కి కూడా ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా తన గడ్డం లుక్ బాగుందని కామెంట్స్ కూడా వస్తున్నాయి. మొదట్లో ఈ లుక్ కి తెలుగు ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని కాస్త ఆలోచించిన ఎన్.టి.ఆర్ ఇప్పుడు తన లుక్ కి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో చాలా హ్యాపీగా ఉన్నాడట. ఈ విషయంలో ఎన్.టి.ఆర్ సుకుమార్ ని స్పెషల్ గా ప్రశంసించినట్లు సుకుమార్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలోని ఓ పాటని రేపటి నుంచి షూట్ చేయనున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు.


