యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’. లండన్ షెడ్యూల్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈ చిత్ర టీం స్పెయిన్ షెడ్యూల్ ని కాస్త వెనక్కి జరపడంతో చివర్లో చేయాల్సిన హైదరాబాద్ షెడ్యూల్ ని ఇప్పుడు ఫినిష్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఎన్.టి.ఆర్ అండ్ టీం కలిసి హైదరాబాద్లోనే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. గత రెండు రోజులుగా ఈ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఈ రోజు కూడా అక్కడే షూటింగ్ జరుగుతున్న షూట్ లో ఓ యాక్షన్ ఎపిసోడ్ ని అక్కడ షూట్ చేస్తున్నారు.
ఈ రోజుతో ఈ యాక్షన్ పార్ట్ ని ముగించనున్న ఎన్.టి.ఆర్ రేపటి నుంచి హైదరబాద్ లో పాట షూట్ లో పాల్గొననున్నారు. దీనికి సంబందించిన సెట్ వర్క్ కూడా పూర్తయ్యింది. ఈ సాంగ్ షూట్ తర్వాత ఈ చిత్ర టీం నెల రోజుల షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్లనుంది. స్పెయిన్ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. డిసెంబర్ చివరి ఆడియోని రిలీజ్ చేసి సంక్రాంతి కానుకగా సినిమాని రిలీజ్ చేయనున్నారు. విభిన్న చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.


