కళ్యాణ్ రామ్ ‘పటాస్’ కి క్లాప్ ఇచ్చిన తారక్

jr-ntr

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించనున్న ‘పటాస్’ సినిమా ఈ రోజు ఉదయం లాంచనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఫస్ట్ సీన్ కి క్లాప్ ని ఇచ్చారు. ‘కందిరీగ’, ‘ఆగడు’ సినిమాలకు రైటర్ గా పనిచేసిన అనిల్ రవిపూడి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు.

‘పటాస్’ అనేదే మాస్ టైటిల్, అలాంటి ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో కళ్యాణ్ రామ్ ఫూర్తి రఫ్ లుక్ లోకనిపించనున్నారు. మొదటి సీన్ కి సురేందర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించిన ఈ కార్యక్రమానికి నందమూరి హరికృష్ణ కూడా హాజరయ్యారు. కళ్యాణ్ రామ్ నిర్నిస్తున్న ఈ సినిమాకి సాయి కార్తీక్ మ్యూజిక్ అందించనున్నాడు.

Exit mobile version