నందమూరి కళ్యాణ్ రామ్ ఫుల్ లెంగ్త్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న సినిమా ‘పటాస్’. అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘పటాస్’ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశలో ఉన్నాయి. జనవరి 1న విడుదలైన ఈ సినిమా ఆడియోకి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే అదే రోజున రిలీజ్ అయిన థియేటర్ ట్రైలర్ కి కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.
మాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం కళ్యాణ్ రామ్ నటించిన పటాస్ సినిమాకి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడని సమాచారం. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ సినిమాకి హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న కళ్యాణ్ రామ్ పటాస్ విజయం పై చాలా నమ్మకంగా ఉన్నాడు. కళ్యాణ్ రామ్ సరసన శృతి సోది హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని జనవరి 23న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు.


