ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ భారీగా పెంచేశాడట…ఎంతంటే?

Published on Feb 29, 2020 5:04 pm IST

ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్ లో సూపర్ ఫార్మ్ లో ఉన్నాడు. ఆయన వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా గడుపుతున్న ఎన్టీఆర్ మే నుండి త్రివిక్రమ్ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఐతే త్రివిక్రమ్ మూవీ కోసం ఎన్టీఆర్ పారితోషకం భారీగా పెంచేశాడట. దాదాపు తన రెగ్యులర్ రెమ్యూనరేషన్ కి 30-40 శాతం పెంచేశాడట.

సాధారణంగా ఎన్టీఆర్ 25 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. ఆర్ ఆర్ ఆర్ కొరకు ఆయన ఎక్కువ తీసుకోవడం జరిగింది. ఆర్ ఆర్ ఆర్ విడుదల తర్వాత ఖచ్చితంగా ఎన్టీఆర్ కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చే అవకాశం కలదు. దీనితో భారీగా త్రివిక్రమ్ సినిమాపై క్రేజ్ ఏర్పడి రికార్డు స్థాయి ప్రీ రిలీజ్ బిసినెస్ జరగడం ఖాయం. అందుకే త్రివిక్రమ్ మూవీ కొరకు దాదాపు 50కోట్ల రెమ్యూనరేషన్ ఎన్టీఆర్ తీసుకుంటున్నాడట. అలాగే ఆయన అన్నయ్య కళ్యాణ్ రామ్ తో కలిసి నిర్మాణ భాగస్వామిగా ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ మూవీ కొరకు భారీగా ముట్టనుంది.

సంబంధిత సమాచారం :

X
More