యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా పరంగా పూరి జగన్నాధ్ స్టైల్ తనకి బాగా నచ్చేసిందని ట్వీట్ చేసాడు. చాలా రేర్ గా ట్వీట్స్ వేసే ఎన్.టి.ఆర్ తాజాగా పూరి జగన్నాధ్ తో చెయ్యడం చాలా హ్యాపీ గా ఉందని ట్వీట్ చేసాడు.
ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఆ పాత్రని పూరి జగన్నాధ్ తీర్చిదిద్దిన విధానం ఎన్.టి.ఆర్ కి తెగ నచ్చేసిందట. అలాగే ఎన్.టి.ఆర్ చాలా స్టైలిష్ గా కనిపించడమే కాకుండా పూరి మార్క్ స్టైలిష్ మానరిజమ్స్ కూడా ఈ సినిమాలో ఉంటాయని అవి అందరినీ ఆకట్టుకుంటాయని అంటున్నారు.
ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్ నిర్మాత. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది.


