‘అరవింద’ కోసం కాలేజీకి వెళ్లనున్న ‘జూ ఎన్టీఆర్’ !

Published on Jul 8, 2018 12:53 pm IST

జూ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా ఈ చిత్ర టీజర్ ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15న విడుదల చేయనున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌ మరో వారం రోజుల పాటు జరగనుంది. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించి యాక్షన్‌ సన్నివేశాల్లోనే తారక్ ఎక్కువుగా నటించారు. కాగా తర్వాత షెడ్యూల్‌ నుండి ఎన్టీఆర్ కాలేజ్‌ సీన్స్‌లో మరియు సాంగ్స్ లో నటించనున్నారట. అలాగే పొల్లాచ్చిలో కూడా హీరోహీరోయిన్ల మీద కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది.

సంబంధిత సమాచారం :