డాగ్ హౌస్ లో షూటింగ్ చేస్తున్న ఎన్.టి.ఆర్

Jr-NTR-Police
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ రోజు ఈ చిత్ర టీం హైదరాబాద్ లోని డాగ్ హౌస్ లో షూటింగ్ చేస్తోంది. డాగ్ హౌస్ లో ఎన్.టి.ఆర్ పై వచ్చే కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నారు. ఇటీవలే జరిపిన నైట్ షూట్ షెడ్యూల్స్ లో ఎన్.టి.ఆర్ – నోర ఫతేహి పై వచ్చే ఓ ఐటమ్ సాంగ్ ని షూట్ చేసారు.

ఈ సినిమా స్టార్టింగ్ రోజునే 2015 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేస్తామని చెప్పడం మరియు మధ్యలో షూటింగ్ కి చిన్న బ్రేక్ రావడం వలన ఈ చిత్ర టీం అనుకున్న టైంకి షూటింగ్ ఫినిష్ చెయ్యాలని డే అండ్ నైట్ షూటింగ్ చేస్తున్నారు. ఎన్.టి.ఆర్ సరసన మూడోసారి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.

Exit mobile version