ఎన్టీఆర్,కోహ్లీ నిజంగానే కలిసి నటిస్తున్నారు…!

Published on Jun 20, 2019 7:51 pm IST

స్టార్ హీరో ఎన్టీఆర్, స్టార్ క్రికెటర్ కోహ్లీ కలిసి నటిస్తున్నారా…? అని అడిగితే అవుననే అంటున్నారు. కాకపొతే వీరిద్దరూ కలిసి సినిమాలో హీరోలుగా నటించడం లేదులెండి.ఓ సోషల్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా చిత్రీకరించే వీడియోలో నటించి తమవంతు సామజిక బాధ్యత నెరవేర్చనున్నారు. మనదేశంలో రోడ్డు ప్రమాదాలు చాలా అధికం. మనదేశంలో వయసుపైబడి లేక అనారోగ్యం వలన సంభవించే మరణాల కంటే రోడ్డు ప్రమాదం వలన సంభవించే మరణాల వలనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీటికి అనేక కారణాలు కలవు వాటిలో ముఖ్యమైంది మద్యం తాగి డ్రైవింగ్ చేయడం.

అందుకే మ‌ద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఎన్ డి టీవీ వారు చిత్రీకరించనున్న ఓ వీడియోలో వీరిద్దరూ కలిసి నటించనున్నారట. ఇంకా వీరితోపాటు దేశంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ప్రోగ్రాంలో భాగస్వాములు కానున్నారని సమాచారం. త్వ‌ర‌లోనే ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

సంబంధిత సమాచారం :

X
More