ఒకరేమో స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించిన పార్టీకి అధినేత, మరొకరేమో నటనలో వారసుడు. ఎవరనేది ఇప్పటికే అర్థమైందనుకుంటా..! ఇంకెవరు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మరియు జూ. ఎన్.టి.ఆర్. ఈ సారి ఎన్నికల ప్రచారంలో తారక్ పాల్గొనకపోవడంతో తన సపోర్ట్ పార్టీకి లేదని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుత తాజా పరిస్థితులు అలాంటివేమీ లేవు అనే సంకేతాలను ఇస్తున్నాయి.
2014 ఎన్నికల్లో విజయ డంఖా మోగించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని జూ. ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రామ్ ఈ రోజు ఉదయం ఆయన స్వగృహంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఈ కుటుంబంలో ఉన్న సమస్యలు సమసిపోతాయని అభిమానులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఎన్.టి.ఆర్ ‘రభస’ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ ని ఎన్.టి.ఆర్ బర్త్ డే కానుకగా మే 20న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


