అక్కకు సపోర్ట్ చేస్తున్న నందమూరి బ్రదర్స్ !

అక్కకు సపోర్ట్ చేస్తున్న నందమూరి బ్రదర్స్ !

Published on Nov 17, 2018 10:50 AM IST


విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి మనువరాలు స్వర్గీయ నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని తెలంగాణ లో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ పార్టీ తరువున ఆమె కూకట్ పల్లి నియోజిక వర్గం నుండి బరిలో నిలిచారు. ఈరోజుఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.

ఇక తాజాగా ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమె తమ్ముళ్లు కళ్యాణ్ రామ్ , ఎన్టీఆర్ లు ట్విట్టర్ ద్వారా సుహాసిని కి విజయం వరించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారు దానికి సంబందించిన ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు. ఇక ఎన్నికల్లో సుహాసిని తరుపున ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు