షూటింగ్ మొదలుపెట్టిన ఎన్టీఆర్ !

‘జై లవ కుశ’ తరవాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాకు సైన్ చేశారు. ఈ సినిమా కోసం ఆయన కొద్ది నెలలుగా వర్కవుట్స్ చేస్తూ, స్పెషల్ డైట్ చేస్తూ సుమారు 17 కేజీల వరకు బరువు తగ్గి సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు. త్రివిక్రమ్, తారక్ లు మొదటిసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై భారీ స్థాయి అంచనాలున్నాయి.

ఈ చిత్ర షూటింగ్ ఈరోజే రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. తారక్ మొదటిరోజు నుండే షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ మొదటి షెడ్యూల్లో ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ ల నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.