ఎన్టీఆర్ కథలు వింటున్నాడట..!

Published on Apr 10, 2020 8:48 am IST

ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీమ్ గా నటిస్తున్న ఎన్టీఆర్ కి కరోనా కర్ఫ్యూ కారణంగా విరామం దొరికింది. ఈ ఏడాది ప్రారంభం నుండి తీరిక లేకుండా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొన్న ఎన్టీఆర్, ఇప్పుడు తన సమయాన్ని ఫ్యామిలీకి కేటాయిస్తున్నారు. భార్యా పిల్లలతో క్వాలిటీ టైం గడుపుతున్న తారక్ పనిలోపనిగా దర్శకుల నుండి కథలు కూడా వింటున్నారట. ఇప్పటికే తన 30వ చిత్రం త్రివిక్రంతో ప్రకటించేసిన ఆయన కొందరు దర్శకుల నుండి కథలు వింటూ 31వ చిత్రానికి ప్రణాళికలు రచిస్తున్నారట.

ఎన్టీఆర్ 31వ చిత్రం కొరటాల శివతో ఉంటుందని ప్రచారం జరుగుతున్నా ఎటువంటి అధికారిక సమాచారం లేదు. తన ఇమేజ్ కి తగ్గ మంచి కథ తీసుకువచ్చిన దర్శకుడితో కమిట్ కావచ్చనే ఉద్దేశంతో ఎన్టీఆర్ దర్శకుల నుండి కథలు వింటున్నాడని సమాచారం. ఇక ఆర్ ఆర్ ఆర్ కారణంగా ఎన్టీఆర్ అభిమానులు ఆయనని స్క్రీన్ పై రెండేళ్లు మిస్ అయ్యారు. ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాది జనవరి 21న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More