ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ అదిరిందిగా..!

ntr

టాలీవుడ్ టాప్ హీరో ఎన్టీఆర్ అనేక వాణిజ్య ఉత్పత్తులకు ప్రచార కర్తగా ఉన్నారు. కాగా దేశంలోని ప్రముఖ బెవరేజ్ సంస్థ పార్లీ ఆగ్రో ఉత్పత్తులలో ఒకటైన అప్పీ ఫిజ్జ్ సౌత్ ఇండియా లెవెల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరిలో పార్లీ ఆగ్రో సంస్థ ఎన్టీఆర్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఐతే తాజాగా ఆ ప్రకటన చిత్రీకరణలో పాల్గొన్న ఎన్టీఆర్ లుక్ కిరాక్ గా ఉంది. రెడ్ టి షర్ట్ పై బ్లాక్ జాకెట్ ధరించి ఇంటెన్స్ లుక్స్ ఇస్తున్న ఎన్టీఆర్ గెటప్ అదిరిపోయింది. ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ని తెరపై చూడాలని తహతహలాడుతున్న ఫ్యాన్స్ కి ఇలా ప్రకటనలలో దర్శనమిస్తూ వారికి కొంచెం ఉపశమనం కలిగిస్తున్నాడు.

కాగా ఇటీవల విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ జరిపారు. ఈ షెడ్యూల్ నందు కేవలం ఎన్టీఆర్ మాత్రమే పాల్గొన్నాడు. తదుపరి షెడ్యూల్ కి బ్రేక్ దొరకడంతో ఎన్టీఆర్ ఇలా ఒప్పందమైన వ్యాపార ప్రకటనలలో పాల్గొంటున్నాడు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తుండగా.. మరో హీరో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు రోల్ చేస్తున్నారు. ఈ చిత్రం జులై 30న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది.

Exit mobile version