మొన్న విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు మిక్సడ్ రివ్యూస్ కారణంగా బాక్సాఫిస్ వద్ద మొదటి రోజు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది. మొదటి రోజు ఈసినిమా తెలంగాణ &ఏపీ లో కలిపి కేవలం 1.62 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇక రెండవ రోజు ఈ చిత్రం యొక్క కలెక్షన్స్ దారుణంగా వున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 52 లక్షల షేర్ ను మాత్రమే రాబట్టింది. దాంతో ఈసినిమా కూడా డిజాస్టర్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక అటు ఓవర్సీస్ లో కూడా దారుణమైన కలెక్షన్స్ ను రాబడుతుంది ఈ చిత్రం.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం యొక్క రెండు రోజుల వసూళ్ల వివరాలు :
ఏరియా | కలక్షన్స్ |
నైజాం | 0.54 కోట్లు |
సీడెడ్ | 0.31 కోట్లు |
గుంటూరు | 0.56 కోట్లు |
వైజాగ్ | 0.21కోట్లు |
తూర్పు గోదావరి | 0.13కోట్లు |
పశ్చిమ గోదావరి | 0.11 కోట్లు |
కృష్ణా | 0.18 కోట్లు |
నెల్లూరు | 0.08కోట్లు |
మొత్తం తెలంగాణ &ఏపీలో రోజులకు గాను షేర్ | 2.14 కోట్లు |