నిమ్మ‌కూరుకి వెళ్తున్న విద్యాబాలన్ !

Published on Jan 6, 2019 4:49 pm IST

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్స్ లో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ జనవరి 9న విడుదల కానుంది. కాగా చిత్రబృందంతో పాటు బాలయ్య మరియు విద్యాబాలన్ ఎన్టీఆర్ పుట్టి పెరిగిన నిమ్మ‌కూరుకి ఈ నెల 7వ తేదీన వెళ్లనున్నారు.

బాలయ్య – విద్యాబాలన్ మధ్య వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను నిమ్మకూరులో షూట్ చెయ్యనున్నారు. అలాగే కథానాయకుడు ఖచ్చితంగా విజయం సాధిస్తుందని.. నిమ్మ‌కూరులోనే తమ చిత్రం మొదటి విజ‌యోత్స‌వ యాత్రను ప్రారంభించాలని బాలయ్య నిర్ణయించారట.

ఇక ఇప్పటికే కథానాయకుడు ప్రమోషన్స్ ను చిత్రబృందం వేగవంతం చేసింది. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ బయోపిక్లో రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను పిబ్రవరి 7న విడుదల చేయనున్నారు. ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ ,విబ్రి మీడియా సంయుక్తంగా ఈ బయోపిక్ ను నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More