నెట్ ఫ్లిక్స్ కి ఎన్టీఆర్ ‘డ్రాగన్’? భారీ మొత్తంలో డీల్ కానీ!

Dragon

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ (Dragon) (అనధికారిక టైటిల్) కోసం అందరికీ తెలిసిందే. కొంచెం ఆలస్యం అవుతున్నప్పటికీ మేకర్స్ మాత్రం అవుట్ పుట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నెక్స్ట్ లెవెల్లో సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ సినిమా మీద ఉన్న హైప్ కి తగ్గట్టుగానే ఆల్రెడీ భారీ మొత్తంలో ఓటిటి డీల్ కూడా జరిగినట్టు తెలుస్తుంది.

Dragon for Netflix – నెట్ ఫ్లిక్స్ కి ఎన్టీఆర్ ‘డ్రాగన్’ హక్కులు?

వరల్డ్ వైడ్ పాపులర్ అయ్యినటువంటి దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఎన్టీఆర్ నీల్ (NTR Neel) సినిమా హక్కులు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాని వారు ఏకంగా 120 కోట్లకి పైగా వెచ్చించి మొత్తం పాన్ ఇండియా భాషలు సహా ఇంటర్నేషనల్ భాషల్లో కూడా సొంతం చేసుకున్నారని తెలుస్తుంది.

కానీ కండిషన్స్ ఉన్నాయట!?

ఈ సినిమాకి వారు అంత మొత్తంలో డీల్ ఇచ్చినప్పటికీ సినిమా పెర్ఫామెన్స్ మీద ఆధారపడి ఉండొచ్చట. అంటే సినిమా అంచనాలు అందుకోని పక్షంలో ఈ ధర తగ్గొచ్చని కూడా వినిపిస్తుంది. సో ఈ కండిషన్ మీద ఎన్టీఆర్ నీల్ ఓటిటి డీల్ ముగిసినట్టు టాక్.

Exit mobile version