మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఇండియాస్ టాప్ దర్శకుల్లో ఒకరైన మాస్ యాక్షన్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో చేస్తున్న క్రేజీ యాక్షన్ ప్రాజెక్ట్ కోసం అందరికీ తెలిసిందే. డ్రాగన్ గా తెరకెక్కుతున్న ఈ అంతర్జాతీయ లెవెల్ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనప్పటికీ షూటింగ్ మాత్రం నెమ్మదిగా వెళుతుంది.
అయితే ఈ సినిమా ఇప్పటికి సగం కూడా పూర్తి కాలేదట. దాదాపు 40 శాతం మేరే కంప్లీట్ అయ్యిందట. సో మిగతా అంతా పూర్తయ్యి రిలీజ్ కావాలి అంటే ఇంకెంత సమయం కావాల్సి ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. సో అభిమానులు మరికొంత కాలం ఆగాల్సిందే. ఇక ఈ భారీ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
