ప్రస్తుతం తెలుగు హీరోలంతా ‘లుక్’ జపం చేస్తున్నారు. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్లు ఇలా హీరోగా నిరూపించుకోవాల్సిన అన్ని విషయాల్లో కొత్త పంథాను అందిపుచ్చుకుంటూనే లుక్ విషయంలోనూ చాలా జాగ్రత్తగా నడుచుకుంటున్నారు. ‘జిల్’ సినిమాతో గోపిచంద్, ‘టెంపర్’తో ఎన్టీఆర్, ‘1 నేనొక్కడినే’తో మహేష్ బాబు ఇలా సరికొత్త లుక్‌లో ఆకట్టుకున్నవారే! ఇక ‘టెంపర్’ సినిమాతో ఓ సరికొత్త లుక్‌లో కనిపించి ఇప్పటికే అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన ఎన్టీఆర్, తాజాగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో మరింత కొత్తగా కనిపిస్తూ అభిమానులను మంత్రముగ్ధులను చేసేశారు.
బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో, ఎన్టీఆర్ హీరోగా, తన స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో మ్యాజిక్ చేసే దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్న సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈరోజే లండన్‌లో మొదలైంది. సెప్టెంబర్ వరకూ భారీ ఎత్తున జరగనున్న ఈ షెడ్యూల్లో ఇప్పటివరకూ చూడని స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయట. ఇక షూటింగ్ మొదలైన సందర్భంగా సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్‌ను విడుదల చేశారు. ఈ స్టిల్స్‌లో ఎన్టీఆర్‌ను చూసినవారంతా ఒక్కమాటలో ‘అదిరిపోయింది’ అనేస్తున్నారు. ఎన్టీఆర్ హెయిర్ స్టైల్, గడ్డం అతడి అందాన్ని రెట్టింపు చేయడమే కాక ఎన్టీఆర్ లుక్కు స్టైలిష్నెస్ను తెచ్చిపెట్టింది.
ఇక వర్కింగ్ స్టిల్స్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే #NTR25 ట్యాగ్‌తో ట్విట్టర్ నెట్‌వర్క్‌లో ఈ స్టిల్స్ ట్రెండ్ అవుతూ ఉండడం విశేషం. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా స్టైలిష్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం. ‘నాన్నకు ప్రేమతో’ అనే ఆసక్తికర టైటిల్‌ను I సినిమా కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.


