ఆసక్తి నెలకొన్న ఎన్టీఆర్ తరుపరి చిత్రం !

21st, October 2017 - 03:18:38 PM


వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఫిబ్రవరి నుండి ఈ సినిమా మొదలు కానుంది, ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే, ఆ సినిమా తరువాత ఎన్టీఆర్ సినిమా ఉండబోతుంది.

త్రివిక్రమ్ సినిమా తరువాత ఎన్టీఆర్, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. విక్రమ్ కుమార్ రూపొందించే సినిమాలు రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా, కొత్తగా ఉంటాయి. గతేడాది ‘24’ చిత్రంతో సక్సెస్ అందుకున్న విక్రమ్.. ప్రస్తుతం అఖిల్ హీరోగా ‘హలో’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.