
‘టెంపర్’ సినిమా సక్సెస్ తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లండన్ లో శరవేగంగా జరుగుతోంది. లండన్ లో ఓ ఫేమస్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎన్.టి.ఆర్ – రకుల్ ప్రీత్ సింగ్ – రాజేంద్ర ప్రసాద్ లపై వచ్చే కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాని 2016 సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యాలని నిర్ణయించారు, ఆ దిశగానే షూటింగ్ ని శరవేగంగా ఫినిష్ చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే అప్పుడే ఎన్.టి.ఆర్ తదుపరి సినిమాల న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఎన్.టి.ఆర్ తదుపరి సినిమా ఎక్కువ భాగం కొరటాల శివ డైరెక్షన్ లో ఉంటుందని ఇది వరకే మేము తెలియజేశాం. తాజాగా ఎన్.టి.ఆర్ సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఎన్.టి.ఆర్ తదుపరి రెండు సినిమాలకి క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యిందని అంటున్నారు. ఎన్.టి.ఆర్ తదుపరి మూవీల కాంబినేషన్ విషయానికి వస్తే.. ఎన్.టి.ఆర్ – వక్కంతం వంశీ కాంబినేషన్ లో ఒక మూవీ, అలాగే కొరటాల శివ – ఎన్.టి.ఆర్ – మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందని సమాచారం. కానీ సుకుమార్ సినిమా తర్వాత మొదటగా ఏ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఎలా వచ్చినా ఈ రెండు కాంబినేషన్స్ అభిమానుల్లో ఆసక్తిని పెంచేస్తున్నాయి.

