కొడుకు అభయ్ రామ్ తో ఎన్టీఆర్ నడక ప్రయాణం ఎక్కడికో?.

Published on Jun 2, 2019 9:01 pm IST

జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్ తో కలిసి ఎన్టీఆర్ నైట్ వాక్ చేస్తున్న ఫొటో ని ఎవరో క్లిక్ మనిపించారు. అభయ్ ఏదో అగిగేతే స్వయంగా కొనిపించడానికి తీసుకెళుతున్నట్లున్న ఆ పిక్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయి పట్టుకుని పక్కన నడుస్తున్న బుల్లి టైగర్ అభయ్ రామ్ ల పిక్ స్టైలిష్ గా వుండి.

ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లు రాజమౌళి దర్శకత్వంలో కలిసిచేస్తున్న “ఆర్ ఆర్ ఆర్” షూటింగ్ షెడ్యూలు మొదలుకావాల్సివుంది. ఈ విరామంలో చరణ్, భార్య ఉపాసనతో కలిసి ఆఫ్రికా ట్రిప్ లో ఉండగా, ఎన్టీఆర్ మాత్రం తండ్రి హరికృష్ణ మరణించి సంవత్సరం కూడా నిండకపోవడంతో విహారాలకు, వినోదాలకు దూరంగా ఉంటున్నాడు. అందుకే ఎన్టీఆర్ హైదరాబాద్ వదిలి ఎక్కడికి వెళ్ళలేదు.

సంబంధిత సమాచారం :

More