సుకుమార్‌ను పొగడ్తలతో ముంచెత్తిన ఎన్టీఆర్!

సుకుమార్‌ను పొగడ్తలతో ముంచెత్తిన ఎన్టీఆర్!

Published on Oct 2, 2015 6:00 PM IST

ntr-sukumar
తెలుగు సినీ పరిశ్రమలో తీసిన అతికొద్ది సినిమాలతోనే తనదైన మార్క్, బ్రాండ్‌ను సృష్టించుకున్న దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ప్రస్తుతం ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి ‘నాన్నకు ప్రేమతో’ అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఓ స్టైలిష్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈమధ్యే ఓ భారీ లండన్ షెడ్యూల్ పూర్తి చేసుకొని తదుపరి స్పెయిన్ షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది. ఇక ఇదిలా ఉంటే దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి రూపొందించిన ‘కుమారి 21 ఎఫ్’ అనే సినిమాకు సంబంధించిన టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని ఈ సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని టీజర్‌ను లాంచ్ చేశారు.

ఇక ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ సుకుమార్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. సుకుమార్ సినిమా అంటే కచ్చితంగా ఏదో కొత్తదనం ఉండి తీరుతుందని తెలుపుతూ, ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. దర్శకుడిగా సుకుమార్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదని, ఆయన చేసిన సినిమాల్లో కొన్ని ఫ్లాప్ అయినా కూడా దర్శకుడిగా మాత్రం ఆయనెప్పుడూ విఫలం కాలేదని ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు. సుకుమార్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఒక రెస్పెక్ట్ ఉందని ఎన్టీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం హైలైట్‌గా నిలిచింది. ఇక ‘కుమారి 21 ఎఫ్’ సినిమా విషయానికి వస్తే.. సుకుమార్ శిష్యుడు సూర్యప్రతాప్ తెరకెక్కించిన ఈ సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు