యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో రానున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుపుకుంటోంది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఈ మూవీకి పలు టైటిల్స్ వినిపిస్తున్నాయి. దీపావళి కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్ చెయ్యాలనుకున్నారు కానీ టైటిల్ ఫైనలైజ్ కాకపోవడం వలన రిలీజ్ చెయ్యలేదు.
మాకు అందిన ప్రత్యేక సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ‘టెంపర్’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ సినిమాకి పనిచేసే విశ్వసనీయ వర్గాలు ఈ సమాచారాన్ని మాకు తెలియజేసారు. ఈ రోజు ఈ టెంపర్ టైటిల్ ని అధికారికంగా అనౌన్స్ చెయ్యడం కాకుండా, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని కూడా రిలీజ్ చేయనున్నారు.
‘బాద్షా’ లాంటి సూపర్ హిట్ తర్వాత బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ ఫుల్ లెంగ్త్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ చెయ్యాలని ఈ చిత్ర టీం డే అండ్ నైట్ షూట్ చేస్తున్నారు. డిసెంబర్ కల్లా ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసేలా అన్ని షెడ్యూల్స్ ని ప్లాన్ చేసారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


