వైరల్ అవుతోన్న ‘ఎన్టీఆర్ – రాజమౌళి’ స్పెషల్ ఫోటో !

Published on May 21, 2019 3:59 am IST

జూ ఎన్టీఆర్ – ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి మధ్య ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనదని.. ఎన్నో సందర్భాల్లో ఇరువురు చాలా వేదికల మీద బాహాటంగానే అభిమానులతో చాలా సార్లు చెప్పుకొచ్చారు. తాజాగా రాజమౌళి, తారక్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతొంది. రాజమౌళి తారక్ ని ఉద్దేశించి.. ‘నా ప్రియమైన తారక్.. మరియు నా భీమ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని ఈ ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటో రాజ‌మౌళి కుమారుడు కార్తికేయ పెళ్లి సంద‌ర్భంగా వీరిద్ద‌రూ కలిసి దిగిన ఫోటో అట.

స్టూడెంట్ నెం.1తో మొదలైన వీరి సక్సెస్ ఫుల్ ప్రయాణం.. ‘ఆర్ఆర్ఆర్’తో అంతర్జాతీయ స్థాయికి వెళ్లబోతుందని ఇప్పటికే అభిమానులు సోషల్ మీడియాలో పలు కామెంట్లు చేస్తూ.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మొత్తానికీ ఈ రోజు అంతా సోషల్ మీడియాలో ‘ఎన్టీఆర్’ పేరే ట్రెండింగ్ అయింది. తారక్ కి పుట్టిన‌రోజు శుభాకాంక్షలు చెప్పడానికి అభిమానులతో.. సినీ సెల‌బ్రిటీల కూడా పోటీపడి మరి తమ శుభాకాంక్ష‌లు తెలియజేశారు.

Wishing my Bheem, dearest Tarak, a very Happy Birthday..:)

Posted by SS Rajamouli on Sunday, May 19, 2019

సంబంధిత సమాచారం :

More