బాహుబలిని అవమానించొద్దంటున్న ఎన్టీఆర్ !

28th, April 2017 - 02:00:52 PM


దర్శకుడు రాజమౌళి, నటుడు జూ. ఎన్టీఆర్ ల మధ్య సాన్నిహిత్యం ఎటువంటిదో అందరికీ తెలిసిందే. ఆ సాన్నిహిత్యంతోనే తారక్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-2’ కు తన పూర్తి మద్దతును తెలియజేశారు. తాజాగా సినిమా చూసిన అయన ‘బాహుబలి ఇండియన్ కాన్వాస్ మీద ఒక మంచి సినిమా. రాజమౌళి కేవలం తెలుగు సినిమాని మాత్రమే గాక ఇండియన్ సినిమాని తరువాతి స్థాయికి తీసుకెళ్లారు. ఆయనకు తమ నటనతో సపోర్ట్ చేసిన నటులు ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణలగారికి అభినందనలు’ అన్నారు.

అలాగే నిర్మాతలు శోభు, దేవినేని ప్రసాద్ లు రాజమౌళి విజన్ కు ప్రాణం పోశారని, కీరవాణిగారు తన సంగీతంతో ప్రతి ఫ్రేమ్ కు ప్రాణం పోశారని అన్నారు. ఇక చివరగా ప్రేక్షకులంతా ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూసి ఆనందించాలని, అంతేగాని పైరసీని ప్రోత్సహించి బాహుబలి లాంటి గొప్ప చిత్రాన్ని అవమానించవద్దని తెలిపారు.