‘అరవింద సమేత’ కోసం నాన్ స్టాప్ గా షూట్ చేస్తున్న ‘ఎన్టీఆర్’ !

‘అరవింద సమేత’ కోసం నాన్ స్టాప్ గా షూట్ చేస్తున్న ‘ఎన్టీఆర్’ !

Published on Jun 24, 2018 7:08 PM IST

జూ ఎన్టీఆర్ ఇంట పండుగ వాతావరణం నెలకొంది. ఆయన సతీమణి ‘లక్ష్మీ ప్రణతి’ ఈ నెల 14న పండంటి బాబుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం దసరాకి ప్రేక్షకుల ముందుకు రావడానికి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

కాగా హైదరాబాద్ శివార్లలో తారక్ మీద పోరాట సన్నివేశాలని శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ బాబు, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే మూడు పాటలు పూర్తయ్యాయి చాలా బాగా వచ్చాయని త్రివిక్రమ్‌ దగ్గరనుండి ట్యూన్స్‌ చేయిస్తున్నారని గతంలో తమన్ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు