యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు సుకుమార్‌ల కాంబినేషన్‌లో ప్రస్తుతం ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. సుకుమార్ అంటే డీటైలింగ్‌కు, స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌కు పెట్టింది పేరు. ఇక మాస్, యూత్‌లో ఫుల్ ఫాలోయింగ్‌తో పాటు నటన పరంగా ది బెస్ట్ అనిపించుకున్న హీరో ఎన్టీఆర్. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే దానిపై ఏ స్థాయి అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకు తగ్గట్టుగానే దర్శక నిర్మాతలు కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన వర్కింగ్ స్టిల్స్‌లో ఎన్టీఆర్ గెటప్‌కు అంతా ఫిదా అయిపోగా, తాజాగా అభిమానులను అలరించేందుకు ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో సినిమా యూనిట్ సిద్ధమవుతోంది. నేడు వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఎన్టీఆర్ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. ఉదయం 11:30కు ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసేందుకు టీమ్ ప్లాన్ చేసుకుంది. ఈ పోస్టర్ ద్వారానే సినిమా టైటిల్‌ను కూడా అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ‘నాన్నకు ప్రేమతో’ అన్న టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం యూరప్‌లో భారీ ఎత్తున షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.


